దేశ సంపదను క్లియరెన్స్ సేల్ కింద మోదీ అమ్మేస్తున్నారు: బీవీ రాఘవులు
- ‘అమ్మకానికి భారతదేశం’ అంశంపై సీఐటీయూ సదస్సు
- మోదీ ఏడేళ్ల పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి
- బీజేపీ నిర్ణయాలను వైసీపీ సమర్థించడం బాధాకరం
- బహుశా జైలుకు వెళ్లాల్సి వస్తుందనేమో
వైజాగ్ స్టీల్ ప్లాంట్, కృష్ణపట్నం ఓడరేవు వంటి వాటిని కేంద్రం అమ్మకానికి పెట్టేసిందన్నారు. రాష్ట్రానికి తీరని ద్రోహం జరుగుతున్నప్పటికీ అధికార పార్టీ నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆగిపోతాయనో, జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయం వల్లోనే తెలియదు కానీ బీజేపీ నిర్ణయాలను వైసీపీ నేతలు సమర్థించడం బాధాకరమని రాఘవులు అన్నారు. ప్రతిపక్షం కూడా దీనిపై గొంతెత్తడం లేదని రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు.