కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన షణ్ముఖ్.. చాయ్ బిస్కెట్ ఫేం శ్రీవిద్యతో కలిసి గృహ ప్రవేశం
- వైరల్ గా మారిన ఫొటోలు
- ఎవరా అమ్మాయి? అంటూ చర్చ
- ఇటీవలే దీప్తి సునయనతో షణ్ణూ బ్రేకప్

తాజాగా అతడు కొత్త ఇల్లు కొనుగోలు చేసి అందులోకి వెళ్లాడు. చాయ్ బిస్కెట్ ఫేం శ్రీవిద్యతో కలిసి గృహ ప్రవేశం చేశాడు. పాలు పొంగించి పూజలు చేసి సంప్రదాయబద్ధంగా సొంత ఇంట్లోకి వెళ్లాడు. దీంతో షణ్ణుకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆ చిరునవ్వు, విజయాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నామంటూ ఆకాంక్షించారు.
అయితే, షణ్ణు పక్కన కూర్చున్న ఆ అమ్మాయి ఎవరు? అంటూ శ్రీవిద్య గురించి అభిమానులు చర్చ మొదలుపెట్టారు. కాగా, కెరీర్ పరంగా ప్రస్తుతం షణ్ముఖ్ ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. త్వరలోనే అది రిలీజ్ కానుంది.

