KCR: జిల్లాల పర్యటనలకు కేసీఆర్ రెడీ.. జనగామతో మొదలు

Telangna CM KCR Ready to visit districts from 11th February
  • ఈ నెల 11 నుంచి జిల్లా పర్యటన షురూ
  • కలెక్టరేట్ కార్యాలయాలు, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల ప్రారంభం
  • అనంతరం భారీ బహిరంగ సభలు
గతంలో పలుమార్లు వాయిదా పడిన జిల్లాల పర్యటనను ఈసారి పూర్తి చేయాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అందుకు సమాయత్తమవుతున్నారు. ఈ నెల 11 నుంచి పర్యటనను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా నిజామాబాద్, హనుమకొండ, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ తదితర జిల్లాల్లో పర్యటిస్తారు.

జనగామ పర్యటనతో వీటికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. జిల్లాల పర్యటనల సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల భవన సముదాయాన్ని, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను కేసీఆర్ ప్రారంభిస్తారు. వరంగల్, హైదరాబాద్ తప్ప జిల్లాల్లో నిర్మించిన కార్యాలయాలన్నీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.

ఇటీవల 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను కేసీఆర్ నియమించారు. ఇప్పుడు కార్యాలయాలను ప్రారంభించి వారికి బాధ్యతలను అప్పగించనున్నారు. జిల్లా పర్యటనల సందర్భంగా భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తారు.
KCR
TRS
Districts
Telangana

More Telugu News