Bandi Sanjay: ప్రధాని మోదీ పేరు చెబితేనే చలిజ్వరం వచ్చిందా?: కేసీఆర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలు

Bandi Sanjay fires on CM KCR
  • హైదరాబాదు పర్యటనకు వచ్చిన మోదీ
  • ఎయిర్ పోర్టుకు రాని సీఎం కేసీఆర్
  • జ్వరం వచ్చింటూ ప్రధాని పర్యటనకు దూరం
  • మండిపడిన బండి సంజయ్
  • ఇంత సంస్కార హీనుడివా అంటూ ఫైర్
  ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదు పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రాకపోవడంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు.

ఈ కేసీఆర్ కు ఏంపుట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పేరుచెబితేనే చలిజ్వరం వచ్చిందా? అని ఎద్దేవా చేశారు. ప్రధాని వస్తే కూడా రాలేనంతటి కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారా? అని నిలదీశారు. జ్వరం వచ్చిందంటూ సాకులు చెప్పి తప్పించుకోవడానికి సిగ్గుండాలన్నారు.

తెలంగాణ ప్రజలంటే మోదీకి ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయని, కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా తెలంగాణ ప్రజలపై మమకారంతో మోదీ ఆయనకు అపాయింట్ మెంట్ ఇచ్చేవారని బండి సంజయ్ వెల్లడించారు. అలాంటిది, ప్రధాని హైదరాబాద్ వస్తే స్వాగతించడానికి కేసీఆర్ రాకపోవడం గర్హనీయమని పేర్కొన్నారు. కేసీఆర్ ఇంత సంస్కార హీనుడా? అని ప్రశ్నించారు.
Bandi Sanjay
CM KCR
Narendra Modi
Hyderabad
BJP
TRS
Telangana

More Telugu News