ESMA: ఎస్మా ఆదేశాలపై వెనక్కి తగ్గిన ఏపీ మైనింగ్ శాఖ

AP Mining Dept takes back step on ESMA
  • మంత్రుల కమిటీతో ఉద్యోగుల చర్చలు
  • మళ్లీ ప్రారంభమైన చర్చల ప్రక్రియ
  • ఎస్మా ఉత్తర్వులు ఇచ్చిన మైనింగ్ శాఖ
  • మైనింగ్ శాఖ తీరుపై తీవ్ర అభ్యంతరాలు
ఓవైపు మంత్రుల కమిటీతో ఉద్యోగుల చర్చలు కొనసాగుతున్న తరుణంలో ఏపీ మైనింగ్ శాఖ ఎస్మా ఉత్తర్వులు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది. చర్చల ప్రక్రియ మళ్లీ ప్రారంభమైందని అందరూ భావిస్తున్న తరుణంలో మైనింగ్ శాఖ ఎస్మా నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసింది. చర్చలు జరుగుతున్న సమయంలో ఎస్మా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, కాసేపటికే మైనింగ్ శాఖ ఎస్మా నిర్ణయంపై వెనక్కి తగ్గింది. ఎస్మాపై అవసరమైతే ప్రభుత్వమే ఆదేశాలు ఇస్తుందని తాజాగా వెల్లడించింది. ఈ మేరకు మైనింగ్ శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ప్రొసీడింగ్స్ విడుదల చేశారు.
ESMA
Mining Dept
Andhra Pradesh
Employees

More Telugu News