Bengaluru: పోర్న్ వీడియోలకు బానిసగా మారి.. కటకటాల పాలైన దంపతులు

Bengaluru man solicits partners for wife posts her sleazy videos online
  • ప్రత్యక్షంగా వీక్షించేందుకు వ్యూహ రచన
  • పర పురుషులకు ఆహ్వానం
  • ఆపై మొబైల్ లో చిత్రీకరణ
  • సామాజిక మాధ్యమాల్లో ప్రకటన పోస్ట్ లు

వైవాహిక జీవితంతో సమాజంలో గౌరవంగా జీవించాల్సింది పోయి.. సమాజం సిగ్గు పడే పనులతో కటకటాల పాలైన దంపతుల ఉదంతం ఇది. బెంగళూరులో జరిగిన ఈ ఘటన వివరాలు పరిశీలిస్తే.. 32 ఏళ్ల వినయ్ కుమార్, ఆయన భార్య (27) పోర్న్ వీడియోలకు బానిసగా మారిపోయారు. పోర్న్ వీడియోల్లో కనిపించే వాటిని ప్రత్యక్షంగా చూడాలనుకున్నాడు వినయ్ కుమార్. అందుకు ఆయన భార్య అంగీకారం తెలిపింది.

వినయ్ కుమార్ దంపతులు బెంగళూరులోని సిగసంద్రలో నివాసం వుంటున్నారు. వినయ్ కుమార్ తన భార్య నగ్న ఫొటోలు, వీడియోలను ఒక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసేవాడు. ‘మేము పెళ్లయిన దంపతులం. ఎవరైనా మమ్మల్ని కలవాలనుకుంటే సంప్రదించండి’ అని పోస్ట్ పెట్టాడు. సంప్రదించిన వారికి ఇన్ స్టాగ్రామ్ ఖాతా వివరాలు చెప్పేవాడు. అక్కడ అన్నీ ఓకే అనుకున్న తర్వాత తన ఇంటి చిరునామా చెప్పేవాడు.

ఇంటికి వచ్చిన పురుషులు తన భార్యతో రాసలీలలు చేస్తుంటే దాన్ని వినయ్ కుమార్ ఆస్వాదించడమే కాకుండా, మొబైల్ లో వీడియోలు తీసేవాడు. ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా పోలీసులకు తెలియడంతో వారు దీన్ని రట్టు చేశారు. పోర్నోగ్రఫీ కంటెంట్ ను సామాజిక ఖాతాల్లో పంచుకోవడం నేరం కనుక వీరిపై ఐటీ చట్టంలోని సెక్షన్ 67ఏ కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

  • Loading...

More Telugu News