Junior NTR: ఎన్టీఆర్ తో మల్టీ స్టారర్ ప్లాన్ చేసిన పరశురామ్!

Parashuramand Ntr combo
షార్ట్స్‌లో చూడండి
'గీత గోవిందం' సినిమాతో పరశురామ్ స్టార్ డైరెక్టర్ల జాబితాలోకి చేరిపోయాడు. ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దర్శకుల విషయంలో ఎంతగానో ఆలోచించే మహేశ్ బాబు సైతం వెంటనే ఆయనకి అవకాశం అవ్వడం విశేషం. ఈ ఇద్దరి కాంబినేషన్లో సెట్స్ పైకి వెళ్లిన 'సర్కారువారి పాట' త్వరలో షూటింగు పూర్తిచేసుకోనుంది.

ఈ సినిమా తరువాత నాగచైతన్యతో పరశురామ్ ఒక సినిమా చేయవలసి ఉంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకునే మహేశ్ బాబు ప్రాజెక్టుపైకి పరశురామ్ వెళ్లాడు. అందువలన చైతూ సినిమా చాలా ఫాస్టుగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత సినిమాను ఎన్టీఆర్ తో చేయాలనే ఆలోచనలో పరశురామ్ ఉన్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది.

ఇటీవల పరశురామ్ .. ఎన్టీఆర్ ను కలిసి ఒక కథను వినిపించాడట. అది మల్టీ స్టారర్ తరహాలో సాగే కథ. చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ కావడంతో ఎన్టీఆర్ ఓకే చెప్పాడని అంటున్నారు. అదే నిజమైతే మరో హీరోగా ఎవరు చేయనున్నారనేది తెలియవలసి ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ .. కొరటాల సినిమా కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Junior NTR
Koratala Siva
Parashuam
Mahesh Babu

More Telugu News