50 రోజుల్లో 365 కోట్లు రాబట్టిన 'పుష్ప'

Pushpa movie update
  • డిసెంబర్ 17న వచ్చిన 'పుష్ప'
  • ఈ రోజుతో 50 రోజులు పూర్తి
  • హిందీలోను అత్యధిక వసూళ్లు
  • సెకండ్ పార్టు షూటింగుకి సన్నాహాలు
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప' డిసెంబర్ 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ రోజుతో ఈ సినిమా 50 రోజులను పూర్తి చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదలైంది. 50 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 365 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. తొలిరోజునే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న 'పుష్ప' దానిని తట్టుకుని నిలబడింది. హిందీలోను అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ నుంచి కూడా బాగానే వసూలు చేసింది. ఇతర భాషల్లోను తన సత్తాను చాటుకుంది.

కథాకథనాలు .. ముఖ్యమైన పాత్రలను సుకుమార్ మలిచిన తీరు .. బన్నీ మేనరిజం .. దేవిశ్రీ పాటలు ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని అందుకోవడానికి కారణమని చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు సెకండ్ పార్టు షూటింగుకు ముస్తాబవుతోంది.
Go Back to Shorts
Allu Arjun
Rashmika Mandanna
Sukumar
Pushpa Movie

More Telugu News