పంజాబ్ సీఎం చన్నీ మేనల్లుడి అరెస్ట్!
- చన్నీ మేనల్లుడు భూపీందర్ సింగ్ ను అరెస్ట్ చేసిన ఈడీ
- ఇసుక అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్
- ఎన్నికల సమయంలో బీజేపీ కుట్రలకు పాల్పడుతోందన్న చన్నీ
జనవరి 19న నిర్వహించిన దాడుల్లో రూ. 10 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అంతేకాదు భూపీందర్ కు చెందిన స్థలాల్లో రూ. 8 కోట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. అక్రమ మైనింగ్ కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, కంపెనీలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే చర్యలను ప్రారంభించినట్టు ఈడీ తెలిపింది.
మరోవైపు తన మేనల్లుడిని ఈడీ అరెస్ట్ చేయడంపై సీఎం చన్నీ మండిపడ్డారు. ఎన్నికల నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ ఈ కుట్రకు పాల్పడిందని విమర్శించారు. బీజేపీ కుట్రలకు తాము భయపడమని చెప్పారు. ఆ పార్టీ ఎన్ని కుట్రలకు పాల్పడినా పంజాబ్ లో గెలవడం అసాధ్యమని అన్నారు.