మలయాళంలో ట్వీట్ చేసిన దుబాయ్ రాజు.. అరబిక్ లో రిప్లై ఇచ్చిన కేరళ సీఎం!
- యూఏఈ పర్యటనలో ఉన్న పినరయి విజయన్
- కేరళతో యూఏఈకి ప్రత్యేక అనుబంధం ఉందన్న దుబాయ్ రాజు
- బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటామన్న విజయన్
మలయాళంలో దుబాయ్ రాజు చేసిన ట్వీట్: కేరళతో యూఏఈకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దుబాయ్, యూఏఈ ఆర్థికాభివృద్ధితో పాటు అన్ని రకాల అభివృద్ధిలో కేరళ ప్రజల పాత్ర ఎంతో గొప్పది.
దుబాయ్ రాజు ట్వీట్ కు విజయన్ రిప్లై: మీ ఆత్మీయ స్వాగతానికి, ఆతిథ్యానికి ధన్యవాదాలు. యూఏఈ, దుబాయ్ లతో బంధాలను మరింత బలోపేతం చేసుకుంటాం.