సినీ నటుడు శరత్ కుమార్ కు రెండోసారి కరోనా

Actor Sharath Kumar tests positive for Corona for second time
  • తనకు మరోసారి కరోనా సోకిందని తెలిపిన శరత్ కుమార్
  • ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్నానని వెల్లడి
  • ఇంతకు ముందే కరోనా బారిన పడిన శరత్ కుమార్, రాధిక, వరలక్ష్మి
ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ రెండో సారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'ప్రియమైన స్నేహితులు, రాజకీయ పార్టీలోని సోదర, సోదరీమణులకు... నాకు కరోనా పాజిటివ్ అని ఈ సాయంత్రం తెలిసింది. ప్రస్తుతం నేను ఐసొలేషన్ లో ఉన్నా. నాతో గత వారం రోజుల్లో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోండి' అని కోరారు.

ఇదిలావుంచితే, ఇంతకు ముందే శరత్ కుమార్, ఆయన భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మి కరోనా బారిన పడి కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న కొన్ని రోజులకే మళ్లీ శరత్ కుమార్ మరోసారి కరోనా బారిన పడ్డారు.
Go Back to Shorts
Sharath Kumar
Tollywood
Corona Virus

More Telugu News