నిజాంపేటలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. రోగులు వేరే ఆసుపత్రికి తరలింపు
- మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు
- ప్రమాద సమయంలో ఆసుపత్రిలో 70 మంది రోగులు
- సహాయక చర్యలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
- ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం!
ప్రమాద సమయంలో మొత్తం 70 మంది చికిత్స పొందుతున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదం కారణంగా ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.