Kamalakar Rao: సీఎం కేసీఆర్ మేనమామ కమలాకర్ రావు కన్నుమూత

CM KCR Uncle Kamalakar Rao dies of illness
  • కామారెడ్డిలో మృతి చెందిన కమలాకర్ రావు
  • కమలాకర్ రావు వయసు 94 సంవత్సరాలు
  • శనివారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తి
  • సంతాపం తెలిపిన కేటీఆర్
సీఎం కేసీఆర్ మేనమామ గునిగంటి కమలాకర్ రావు మృతి చెందారు. కమలాకర్ రావు వయసు 94 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో పాటు వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. కామారెడ్డిలోని తన నివాసంలో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. అదే రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులెవరూ అంత్యక్రియలకు హాజరుకాలేదు. స్థానిక టీఆర్ఎస్ నేతలు కమలాకర్ రావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

కమలాకర్ రావుకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మేనమామ మృతి పట్ల కేసీఆర్ విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం తెలియజేశారు. కాగా, కమలాకర్ రావుకు పదేళ్ల కిందట భార్యావియోగం కలిగింది.
Kamalakar Rao
KCR
Demise
Kamareddy

More Telugu News