Salman Khan: హాలీవుడ్ స్టార్ కు తనను తాను పరిచయం చేసుకున్న సల్మాన్ ఖాన్... వీడియో ఇదిగో!

Salman Khan introduces himself to Hollywood star John Travolta
  • బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న సల్మాన్
  • సౌదీ అరేబియాలో అవార్డుల కార్యక్రమం
  • సల్మాన్ కు ఆహ్వానం
  • ఇదే కార్యక్రమానికి విచ్చేసిన జాన్ ట్రవోల్టా
బాలీవుడ్ కండలరాయుడు సల్మాన్ ఖాన్ భారత్ లో సినీ సూపర్ స్టార్లలో ఒకడు. సల్మాన్ భారత్ లోనే కాదు అనేక దేశాల్లో అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే, ఓ హాలీవుడ్ హీరోకి తనను తాను పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల సౌదీ అరేబియాలో రియాద్ లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ ను కూడా ఆహ్వానించారు.

అది ఓ ప్రభుత్వ అవార్డుల కార్యక్రమం. ఈ వేడుకకు హాలీవుడ్ నటుడు జాన్ ట్రవోల్టా కూడా వచ్చాడు. బ్రోకెన్ యారో, పల్ప్ ఫిక్ష్, ఫేస్ ఆఫ్, బాటిల్ ఫీల్డ్ ఎర్త్ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కాగా ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన సల్మాన్, ట్రవోల్టా ముందువరుసలో పక్కపక్కనే కూర్చున్నారు. ఈ సందర్భంగా సల్మాన్ తనను తాను పరిచయం చేసుకుని, గతంలో పలు చిత్రాల్లో ట్రవోల్టా నటనను కొనియాడారు. అందుకు ట్రవోల్టా స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Salman Khan
John Travolta
Awards Function
Riyadh
Soudi Arabia

More Telugu News