Dharmana Krishna Das: జిల్లాల పునర్విభజన నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదు: డిప్యూటీ సీఎం ధర్మాన

Dy CM Dharmana Krishnadas explains new districts decision taken by govt
  • ఏపీలో కొత్త జిల్లాలు
  • పలు చోట్ల నిరసనలు
  • స్పందించిన ధర్మాన కృష్ణదాస్
  • లోతైన అధ్యయనం చేశామని వెల్లడి
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగానే చేపట్టామని వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని, దీనిపై శాస్త్రీయంగా లోతైన అధ్యయనం జరిగిందని స్పష్టం చేశారు.

సత్వర సేవలు, పాలనా పరమైన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని ధర్మాన వివరించారు. రాష్ట్రానికి ఎంతో సేవ చేసిన మహనీయులను స్మరించుకుంటూ, చారిత్రక నేపథ్యాల ఆధారంగా ప్రజల మనోభావాలను, అభిప్రాయాలను గౌరవిస్తూ జిల్లా పునర్విభజన జరిగిందని పేర్కొన్నారు.
Dharmana Krishna Das
New Districts
Andhra Pradesh
YSRCP

More Telugu News