కోలీవుడ్ లో కొత్త రికార్డు సెట్ చేసిన 'పుష్ప'
- క్రితం నెలలో వచ్చిన 'పుష్ప'
- వివిధ భాషల్లో వసూళ్ల జోరు
- ఓటీటీ నుంచి భారీ రెస్పాన్స్
- త్వరలో 'పుష్ప 2' షూటింగ్ మొదలు
తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. హిందీలో ఈ సినిమా ఒక రేంజ్ లో జెండా ఎగరేసింది. ఇక తమిళంలో కూడా 30 కోట్లు వసూలు చేసింది. 'బాహుబలి' .. 'బాహుబలి 2' తరువాత, అక్కడ ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని అంటున్నారు. నిజంగా ఇది ఒక రికార్డేనని చెబుతున్నారు.
ఇక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి కూడా ఈ సినిమాకి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దాంతో అల్లు అర్జున్ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన దుబాయ్ లో ఉన్నాడని అంటున్నారు. త్వరలోనే 'పుష్ప 2' రెగ్యులర్ షూటింగు మొదలుపెట్టనున్నట్టు చెబుతున్నారు.