'వీరమల్లు' కోసం రెడీ అవుతున్న పవన్!

Hari Hara Veeramllu movie update
  • క్రిష్ దర్శకత్వంలో 'వీరమల్లు'
  • 50 శాతం షూటింగు పూర్తి
  • తదుపరి షెడ్యూల్ కి సన్నాహాలు
  • రెండు విభిన్న పాత్రల్లో పవన్
పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబినేషన్లో 'హరి హర వీరమల్లు' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం చిత్రీకరణను జరుపుకుంది. కరోనా కారణంగా .. ముందుగా 'భీమ్లా నాయక్' ను పూర్తిచేయాలని పవన్ అనుకోవడం వలన 'వీరమల్లు' షూటింగులో జాప్యం జరుగుతూ వచ్చింది.

ఇక త్వరలో కరోనా తీవ్రత తగ్గే అవకాశాలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో, తదుపరి షెడ్యూల్ కి అవసరమైన సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే భారీ సెట్లను రెడీ చేసేశారు. ఇక ఢిల్లీలోని 'చాందినీ చౌక్' సెట్ వర్క్ మాత్రం జరుగుతోందని అంటున్నారు. ఇందుకోసం భారీ మొత్తమే ఖర్చు చేస్తున్నారట.

ఈ కథ రెండు కాలాల్లో నడుస్తుందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ చెప్పింది. దాంతో మొగల్ కాలంలో గజదొంగగానే కాకుండా, మోడ్రన్ లుక్ తోను పవన్ కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయమే అందరిలోను మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాకి ఎ.ఎమ్. రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
Go Back to Shorts
Pavan kalyan
Nidhi Agerwal
Krish
Hari Hara Veeramallu Movie

More Telugu News