జేడీ చక్రవర్తి, నేను ఆ రోజున బతికి బయటపడ్డాం: సినీ నటి మహేశ్వరి
- 'గులాబీ' ప్రమాదాన్ని గుర్తుచేసుకున్న మహేశ్వరి
- జేడీ చాలా ఫాస్టుగా బైక్ నడిపాడు
- బైక్ స్కిడ్ కావడంతో లోయలోకి వెళ్లాము
- చెట్టు వల్ల ప్రమాదం తప్పింది
"ఆ సినిమాలో ఆ పాటకి ముందు నేను ఎప్పుడూ బైక్ ఎక్కింది లేదు. పైగా ఆ పాటలో బైక్ పై చాలా ఫాస్టుగా వెళ్లాలని జేడీతో కృష్ణవంశీ చెప్పారు. దాంతో నా భయం మరింత పెరిగిపోయింది. నిజంగానే జేడీ బైక్ ను చాలా ఫాస్టుగా నడిపాడు. పాట చిత్రీకరణ జరుగుతూ ఉండగా బైక్ స్కిడ్ అయింది.
అంతే ఒక్కసారిగా బైక్ లోయలోకి దూసుకుని వెళ్లింది. అసలు ఏం జరుగుతుందనేది నాకు అర్థం కాలేదు. మా అదృష్టం బాగుండి లోయకి ముందు ఒక చెట్టు ఉండటంతో బతికి బయటపడ్డాము. ఆ తరువాత మమ్మల్ని .. బైక్ ను అక్కడి నుంచి వెనక్కి లాగారు" అంటూ అప్పుడు జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంది.