అనుష్క శర్మ కంపెనీతో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ జట్టు.. రూ.400 కోట్లతో భారీ ఒప్పందం
- సోదరుడు కరణేశ్ తో కలిసి ‘క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్’ నిర్వహణ
- 8 సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ చేసేందుకు ఓటీటీల ఒప్పందం
- కన్ఫర్మ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఇంకా స్పందించని అమెజాన్
రూ.400 కోట్లతో భారీ డీల్ ను సెట్ చేసుకున్నాయి. ఈ విషయాన్ని అనుష్క శర్మ సోదరుడు కరణేశ్ ధ్రువీకరించాడు. ఒప్పందం ప్రకారం రాబోయే 18 నెలల్లో 8 సినిమాలు, వెబ్ సిరీస్ లను ఆయా ప్లాట్ ఫాంలలో రిలీజ్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. వాటితో పాటు వేరే వాటిలోనూ మరికొన్ని సినిమాలు, సిరీస్ లను విడుదల చేయాల్సి ఉంటుందన్నాడు.
ఈ విషయాన్ని ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కన్ఫర్మ్ చేయగా.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంకా స్పందించలేదు. ఆ రెండు సంస్థల నుంచి అధికారిక ప్రకటన వచ్చాక మరిన్ని వివరాలను వెల్లడిస్తామని కరణేశ్ చెప్పాడు.