రిపోర్టర్‌ను తిట్టిన బైడెన్.. వీడియో ఇదిగో
- శ్వేతసౌధంలో ఘటన
- ద్రవ్యోల్బణంపై రిపోర్టర్ ప్రశ్న
- కోపగించుకున్న బైడెన్
- తర్వాత ఫోన్ చేసి సారీ చెప్పిన వైనం
మధ్యంతర ఎన్నికల వేళ ద్రవ్యోల్బణం అంశాన్ని రాజకీయ బాధ్యతగా భావిస్తారా? అని ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బైడెన్ అసహనానికి గురై ద్రవ్యోల్బణం ఓ గొప్ప సంపద అన్నారు. 'వాట్ ఏ స్టుపిడ్ సన్ ఆఫ్ ఏ బి....' అంటూ తిట్టారు. రిపబ్లికన్లకు ఫాక్స్ ఛానల్ అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వ విధానాలను పీటర్ డూసీ ఎప్పుడూ తప్పుపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే బైడెన్ ఆ రిపోర్టర్‌పై మండిపడ్డారు. అయితే, ఈ ఘటన జరిగిన అనంతరం ఆ రిపోర్టర్‌కు బైడెన్ ఫోన్ చేసి క్షమాపణలు చెప్పినట్లు తెలిసింది.