ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు
- జీఏడీ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు నోటీసులిచ్చిన ఉద్యోగ సంఘాలు
- ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె
- పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
మరోవైపు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చర్చలకు రావాలని పిలిచినా ఉద్యోగ సంఘాల నేతలు రాలేదని చెప్పారు. వారు వస్తే అన్ని విషయాలను వివరిస్తామని తెలిపారు. రేపు కూడా వారి కోసం ఎదురు చూస్తామని... చర్చలకు రావాలనే సమాచారాన్ని పంపిస్తామని చెప్పారు.