అలవాట్ల వల్లే అసిడిటీ.. వీటిని దూరం పెడితే చాలు!

24-01-2022 Mon 14:03 | Health
  • ఒకే విడత ఎక్కువ ఆహారం తీసుకోవద్దు
  • కొద్ది మొత్తంలో ఎక్కువ సార్లు తీసుకోవాలి
  • తిన్న వెంటనే పడకకు దూరంగా ఉండాలి
  • టీ, కాఫీ, ఆల్కహాల్ ను తగ్గించాలి
ఒకప్పుడు చాలా అరుదుగా ఎవరో ఒకరిలో అసిడిటీ, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు కనిపించేవి. కానీ, నేడు యువకుల నుంచి వయసుమళ్లిన వారి వరకు ఎక్కువ మందిలో ఇవి సాధారణంగా మారిపోయాయి. జీవనశైలి మారిపోవడమే అసిడిటీ (ఆమ్ల తత్వం పెరగడం)కి దారితీస్తోందని తెలుసుకోవాలి.

శారీరక శ్రమ ఉండదు. పైగా తీసుకునే ఆహారంతో అధిక కేలరీలు శరీరంలోకి చేరతాయి. దీంతో పేగుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. టీ, కాఫీలు అధికంగా తీసుకోవడం, శీతలపానీయాలు, తిన్న వెంటనే కునుకు తీయడం ఇలాంటి అలవాట్లు సమస్యను పెద్దవి చేస్తాయి.

దీన్నుంచి బయటకు రావాలంటే జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. ఎక్కువ నీరు తీసుకోవడం, సరిపడా నిద్రపోవడం, యోగ, ప్రాణాయామం, శారీరక వ్యాయామాలు అసిడిటీ సమస్య నుంచి బయటకు వచ్చేలా సాయపడతాయి. ఒత్తిడి తగ్గించుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. కొంచెం పరిమాణంలో ఎక్కువ సార్లు ఆహారం తీసుకునే విధానం అనుసరించాలి.

* అధిక కారం, మసాలాలు, ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు, స్నాక్స్, ఫ్రైడ్, ఫాస్ట్ ఫుడ్స్ ను పూర్తిగా దూరం పెట్టాలి. ఎందుకంటే వీటిని జీర్ణం చేసేందుకు కాలేయం కష్టపడాల్సి వస్తుంది. దాంతో అధిక జీర్ణ రసాలు విడుదలై, ఆమ్లతత్వం పెరిగిపోతుంది. ఇది గుండె మంటకు దారితీస్తుంది.

* ఒకేసారి పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోకుండా ఉండాలి. అంటే మధ్యాహ్నం, రాత్రి కడుపునిండా లాగించడానికి బదులు.. మూడు నుంచి నాలుగు సార్లు మినీ మీల్స్ తీసుకోవాలి.

* పుల్లటి పదార్థాలు, పండ్లకు (నారింజ/కమలా, బెర్రీలు) దూరంగా ఉండాలి

* కడుపును ఖాళీగా ఎక్కువ సమయం పాటు ఉంచిన సందర్భాల్లోనూ కడుపులో మంట వస్తుంది. ఆకలి వేసిన వెంటనే కొద్ది మొత్తంలో ఆహారం తీసుకోవాలి.

* తిన్న వెంటనే కాకుండా రెండు గంటలపాటు అయినా కాలక్షేపం చేయాలి. తిన్న తర్వాత పడుకునే సందర్భాల్లో బోర్లా, నిటారుగా కాకుండా ఎడమ చేతివైపు తిరిగి పడుకోవాలి.

* ఆస్పిరిన్ మాత్రలు, టీ, కాఫీ, ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి.

* ఒకవేళ ఒత్తిడి కారణంగా అయితే ప్రాణాయామం, యోగాతో తగ్గించుకోవాలి. తగ్గకపోతే వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి.
aciditycurelife styleunhealthy habits

More Telugu News

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more