మంత్రి కొడాలి నాని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు: వర్ల రామయ్య
- రగులుతున్న కేసినో వ్యవహారం
- తాను కేసినో నిర్వహించలేదన్న కొడాలి నాని
- నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని సవాల్
- అన్ని ఆధారాలు ఉన్నాయన్న వర్ల రామయ్య
- కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని డిమాండ్
ప్రజలు అన్ని అంశాలను గమనిస్తున్నారని వర్ల రామయ్య పేర్కొన్నారు. ఇలాంటి మంత్రిని సీఎం ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. కే కన్వెన్షన్ సెంటర్ లో కేసినో నడిపినట్టు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. తక్షణమే కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.