కొడాలి నానికి మీడియా ముఖంగా సవాల్ విసిరిన బోండా ఉమ

Bonda Uma challenges Kodali Nani
  • మీ కన్వెన్షన్ లో కేసినో జరిగిందని నిరూపిస్తాం
  • కేసినో జరగలేదంటే పెట్రోల్ పోసుకునేందుకు నేను సిద్ధం
  • నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చెయ్
మీ కన్వెన్షన్ సెంటర్ లో ఏ తప్పూ జరగకుంటే టీడీపీ నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారని మంత్రి కొడాలి నానిని టీడీపీ నేత బోండా ఉమ ప్రశ్నించారు. కొడాలి నాని అడ్డంగా దొరికిపోయి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు.

ఆయన విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నామని... ఆయన కన్వెన్షన్ సెంటర్ లో కేసినో ఆటలు జరిగాయని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చెరో డబ్బా పెట్రోల్ తెచ్చుకుందామని... తేల్చుకుందామని అన్నారు. కేసినోలో డ్యాన్స్ చేసిన వారి పేర్లు కూడా తమ వద్ద ఉన్నాయని... విక్టర్, శశిభూషణ్ వంటి వాళ్లు డ్యాన్స్ చేశారని చెప్పారు.

కేసినో జరగలేదంటే పెట్రోల్ పోసుకునేందుకు తాను సిద్ధమని, జరిగినట్టు రుజువైతే మంత్రి పదవికి రాజీనామా చేయి చాలని సవాల్ విసిరారు. కేసినో జరిగిందని మీడియా ముఖంగా నిరూపించేందుకు సిద్ధమని చెప్పారు. మహిళల అర్థనగ్న నాట్యాలను తానే ఆపించానని కొడాలి నాని ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాదు కేసినో జరిగిన వీడియోలను మీడియాకు చూపించారు.
Go Back to Shorts
Bonda Uma
Telugudesam
Kodali Nani
YSRCP

More Telugu News