తెలంగాణకు మూడు రోజుల వర్ష సూచన
- ఆదివారం నుంచి మంగళవారం వరకు వర్షాలు
- కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం
- ఇప్పటికే అకాల వర్షాలతో భారీగా నష్టపోయిన రైతులు
ఆదివారం నుంచి మంగళవారం వరకు కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతులు భారీగా నష్టపోయారు. ఇప్పుడు మరోసారి అకాల వర్షాలు కురువనుండటంతో రైతులు మరింత నష్టపోయే అవకాశం ఉంది.