Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ

AP impose night curfew from today onwards
  • ఏపీలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు
  • రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ
  • అంతర్రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు మినహాయింపు
రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అయితే, అంతర్రాష్ట్ర సరుకు రవాణాకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది.

వివాహాలు, మతపరమైన, సామాజిక కార్యక్రమాలను కనుక బహిరంగంగా నిర్వహిస్తే గరిష్ఠంగా 200 మంది వరకు, హాలులో అయితే 100 మంది వరకు పాల్గొనేందుకు మాత్రమే అనుమతి ఉన్నట్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Andhra Pradesh
Corona Virus
Curfew

More Telugu News