Indane: ఒకే సిలిండర్ వున్న వారికి రెండు గంటల్లోనే డెలివరీ.. హైదరాబాదులో ఇండేన్ తత్కాల్ సేవ!

IndianOil launches Indane Tatkal Seva at Hyderabad
  •  ఫోన్, ఇండేన్ ఆయిల్‌వన్ యాప్, ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ 
  • అదనంగా రూ. 25 చెల్లిస్తే సరి
  • నగరంలో 62 డిస్ట్రిబ్యూటర్ల వద్ద అందుబాటులో..
ఒక్క సిలిండర్‌తో అష్టకష్టాలు పడుతున్న ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు ఇది శుభవార్తే. ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా తత్కాల్ సేవ సౌకర్యాన్ని ప్రారంభించినట్టు ఇండేన్ తెలిపింది. ఇందులో భాగంగా సిలిండర్ బుక్ చేసుకున్న వినియోగదారులకు రెండంటే రెండే గంటల్లో సిలిండర్ డెలివరీ అవుతుందని పేర్కొంది.

అయితే, ఇందుకోసం అదనంగా 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ జనరల్ మేనేజర్ వి. వెట్రీ సెల్వకుమార్ తెలిపారు. ఫోన్, ఇండేన్ ఆయిల్‌వన్ యాప్, ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ద్వారా ఈ సేవలు వినియోగించుకోవచ్చన్నారు. హైదరాబాద్‌లో మొత్తం 62 ఇండేన్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.
Indane
Hyderabad
Gas
Cylinder

More Telugu News