తెలంగాణలో కొత్తగా 2,447 కరోనా పాజిటివ్ కేసుల వెల్లడి

  • గత 24 గంటల్లో 80,138 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 1,112 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి
  • ఇంకా 22,197 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 80,138 శాంపిల్స్ పరీక్షించగా... 2,447 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,112 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 235, రంగారెడ్డి జిల్లాలో 183 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 2,295 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 4,060కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,11,656 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,85,399 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 22,197 మంది చికిత్స పొందుతున్నారు.

Telangana
Corona Virus
Bulletin
Today Cases

More Telugu News