పశ్చిమ బెంగాల్లో పట్టాలు తప్పిన రైలు... ముగ్గురి మృతి
- జల్పాయ్ గురి జిల్లాలో ఘటన
- ప్రమాదానికి గురైన గౌహతి-బికనీర్ ఎక్స్ ప్రెస్
- బోగీల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులు
- ముమ్మరంగా సహాయక చర్యలు
పట్టాలపై పగుళ్లు ఉన్నందునే రైలు ప్రమాదం జరిగినట్టు అంచనా వేస్తున్నా, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు 40 కిలోమీటర్ల వేగంతో వెళుతుండడంతో ప్రమాద తీవ్రత సాధారణ స్థాయిలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఘటన స్థలిలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.