రసవత్తరంగా చివరి టెస్ట్.. తొలి ఇన్నింగ్స్ లో ఇండియాదే ఆధిక్యం
- తొలి ఇన్నింగ్స్ లో ఇండియా స్కోరు 223 పరుగులు
- 210 పరుగులకే ఆలౌట్ అయిన సౌతాఫ్రికా
- 5 వికెట్లు తీసిన బుమ్రా
ప్రస్తుతం క్రీజులో చటేశ్వర్ పుజారా 9 పరుగులు, కెప్టెన్ కోహ్లీ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో కీగన్ పీటర్సన్ 72 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మన బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశాడు. ఉమేశ్ యాదవ్, షమీలు చెరో రెండు వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశాడు.