ఉద్యోగుల సమస్యలపై.. ముఖ్యమంత్రి జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ

cpi Ramakrishna writes letter to Jagan
  • ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్ మెంట్ సరిపోదు
  • కనీసం 27 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలి
  • సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్ మెంట్ సరిపోదని ఆయన లేఖలో పేర్కొన్నారు. వారికి కనీసం 27 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 10 పీఆర్సీలలో ఇంటీరియం రిలీఫ్ కన్నా ఫిట్మెంట్ తక్కువగా ఇవ్వలేదని తెలిపారు. పీఆర్సీపై ప్రభుత్వం చేసిన ప్రకటన అందరినీ నిరాశకు గురి చేసిందని పేర్కొన్నారు. ఇక, 2021 అక్టోబర్ నాటికే గ్రామ సచివాలయ ఉద్యోగులకు రెండేళ్లు పూర్తయిందని... వెంటనే వారికి ప్రొబేషన్ ఖరారు చేసి, పే స్కేల్ అమలు చేయాలని కోరారు.
Go Back to Shorts
Jagan
YSRCP
CPI Ramakrishna

More Telugu News