టీమిండియాలో కరోనా కలకలం... వాషింగ్టన్ సుందర్ కు పాజిటివ్

Washington Sundar tested corona positive
టీమిండియా వన్డే ఆటగాడు వాషింగ్టన్ సుందర్ కరోనా బారినపడ్డాడు. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా వన్డే ఆటగాళ్లు రేపు భారత్ నుంచి బయల్దేరాల్సి ఉంది. ముందస్తుగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో సుందర్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో అతడు కేప్ టౌన్ విమానం ఎక్కడంపై అనిశ్చితి నెలకొంది. టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే ఈ నెల 19న జరగనుంది. అయితే సుందర్ స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేస్తారా? లేక, కరోనా నుంచి కోలుకున్న తర్వాత అతడినే పంపిస్తారా? అనేది తేలాల్సి ఉంది.
Go Back to Shorts
Washington Sundar
Corona Virus
Positive
ODI
Team India
South Africa

More Telugu News