Pushpa: ఓటీటీలో వస్తున్న హిందీ 'పుష్ప'.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..!

Pushpa Hindi version to stream in OTT from Jan 14
  • బాలీవుడ్ లో కూడా ఘన విజయం సాధించిన 'పుష్ప'
  • ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు వర్షన్
  • జనవరి 14న ఓటీటీలో విడుదల కానున్న హిందీ వర్షన్
అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా మూవీ 'పుష్ప' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ లో రూ. 80 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమా తెలుగు వర్షన్ ఇప్పటికే తెలుగులో వచ్చింది.. ఇప్పుడు హిందీ వర్షన్ రిలీజ్ కాబోతోంది. జనవరి 14న హిందీ వర్షన్ స్ట్రీమింగ్ ప్రారంభం కానుందని ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ తెలిపింది. మరోవైపు వీకెండ్ సందర్భంగా శని, ఆదివారాల్లో సినిమా కలెక్షన్లు పెరిగినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
Pushpa
Tollywood
Bollywood
Hindi Version
OTT

More Telugu News