తెలంగాణలో ఈ నెల 20 వరకు కొవిడ్ ఆంక్షల పొడిగింపు
- ఆంక్షలు పొడిగిస్తూ ఉత్తర్వులు
- ర్యాలీలు, మతపరమైన కార్యమాలపై నిషేధం
- శరీర ఉష్ణోగ్రతను చెక్ చేశాకే లోపలికి అనుమతించాలని ఆదేశం
ప్రజా రవాణా, దుకాణాలు, మాల్స్, వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది. శరీర ఉష్ణోగ్రతలను చెక్ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించింది.