న్యూయార్క్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 9 మంది చిన్నారులు సహా 19 మంది సజీవ దహనం
- ఈస్ట్ 81 స్ట్రీట్‌లోని 19 అంతస్తుల అపార్ట్మెంట్లో ఘటన
- రెండు, మూడు అంతస్తుల్లో చెలరేగిన మంటలు
- మరో 13 మంది పరిస్థితి విషమం
- గత కొన్నేళ్లలో ఇలాంటి అగ్ని ప్రమాదాన్ని చూడలేదన్న న్యూయార్క్ మేయర్
రెండు, మూడు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. ఫలితంగా అపార్ట్మెంట్ మొత్తం పొగ వ్యాపించడంతో ఉపిరి తీసుకోవడం అపార్ట్మెంట్ వాసులకు ఇబ్బందిగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే 200 మంది అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే 19 మంది నిర్జీవంగా మారిపోయారు. గత కొన్నేళ్లలో ఇలాంటి అగ్ని ప్రమాదాన్ని తానెప్పుడూ చూడలేదని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు.