Khukri Dance: మంచు కొండల్లో భారత సైనికుల ఖుక్రీ డ్యాన్స్... వీడియో ఇదిగో!

Indian army jawans performs Khukri dance
  • ఉత్తర కశ్మీర్ లో విపరీతంగా మంచు
  • క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లు
  • కుప్వారా జిల్లాలో ఖుక్రీ విన్యాసాలు ప్రదర్శించిన వైనం
  • వీడియో పంచుకున్న భారత ఆర్మీ
భారతదేశం ఎంత విశాలమైనదో తెలిసిందే. ఇంత పెద్ద దేశం, అందులోని ప్రజలు భద్రంగా ఉన్నారంటే అందుకు కారణం సైనికులే. శత్రు సైనికుల కంటే ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ, కుటుంబాలకు దూరంగా వుంటూ విధులు నిర్వర్తించే ఆ వీర సైనికులు నిజంగా త్యాగధనులే. ప్రస్తుతం దేశంలో చలికాలం కావడంతో ఉత్తర కశ్మీర్ లో ఎక్కడికక్కడ మంచు పేరుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ కుప్వారా జిల్లాలో సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు.

తాజాగా, భారత సైన్యానికి చెందిన ఓ బృందం త్రివర్ణ పతాకం ముంగిట ప్రదర్శించిన ఖుక్రీ డ్యాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటోంది. ఖుక్రీ అనేది ఓ వంపు తిరిగిన కత్తి. గూర్ఖా రెజిమెంట్ లో ఉండే సైనికులు తుపాకీతో పాటు దీన్ని కూడా ధరిస్తుంటారు. కాగా, సంగీతానికి అనుగుణంగా జవాన్లు ప్రదర్శించిన ఖుక్రీ విన్యాసాల వీడియోను భారత సైన్యం పంచుకుంది.
Khukri Dance
Soldiers
Kupwara District
Jammu And Kashmir
Indian Army
Video

More Telugu News