తెలంగాణలో మరో 2,606 కరోనా పాజిటివ్ కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 73,156 కరోనా పరీక్షలు
- మరోసారి 2 వేలకు పైన పాజిటివ్ కేసులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 1,583 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 12,180 మందికి చికిత్స
అదే సమయంలో 285 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,92,357 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,76,136 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 12,180కి చేరింది. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,041కి పెరిగింది.
