లవ్ లో పడ్డ హీరోయిన్ నిధి అగర్వాల్.. హీరో ఇంట్లోనే మకాం?
- శింబు ప్రేమలో నిధి ఉందంటూ ప్రచారం
- పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారంటూ వార్తలు
- 'ఈశ్వరన్' షూటింగ్ సమయంలో ప్రేమ మొలకెత్తిందట
మరోవైపు కొంత కాలంగా శింబు ఇంట్లోనే నిధి ఉంటోందనే ప్రచారం కూడా జరుగుతోంది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు వీరు రెడీ అవుతున్నారని అంటున్నారు. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజం అనేది తేలాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు బహిరంగ ప్రకటన చేయాల్సి ఉంటుంది. మరోవైపు ప్రేమాయణాలు శింబుకు కొత్తేమీ కాదు. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లతో ఆయన ప్రేమాయణాలు సాగించారు.