ఎన్టీఆర్ చేతుల మీదుగా రేపు 'రౌడీ బాయ్స్' ట్రైలర్ రిలీజ్!
- ఆశిష్ హీరోగా 'రౌడీ బాయ్స్'
- కథానాయికగా అనుపమ
- దర్శకుడిగా హర్ష కానుగంటి
- ఈ నెల 14వ తేదీన రిలీజ్
ఈ నేపథ్యంలో సంక్రాంతి బరి నుంచి పెద్ద సినిమాలు తప్పుకోవడంతో, చిన్న సినిమాలకి అవకాశం దొరికింది. అలా 'రౌడీ బాయ్స్' కూడా బరిలోకి దిగాడు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదులుతున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించనున్నారు.
ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆశిష్ జోడీగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమాతో ఆశిష్ హీరోగా మంచి మార్కులు సంపాదించుకుంటాడనే నమ్మకంతో దిల్ రాజు ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.