సంక్రాంతి ప్రయాణికుల కోసం.. విశాఖ-యలహంక మధ్య 16, 17వ తేదీల్లో ప్రత్యేక రైళ్లు

South Central Railway Announce special trains between visakha and Yelahanka
సంక్రాంతి ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 16, 17 తేదీల్లో విశాఖపట్టణం-యలహంక మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 16న విశాఖపట్టణం నుంచి మధ్యాహ్నం 3.55 గంటలకు ప్రత్యేక రైలు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 9 గంటలకు యలహంక చేరుకుంటుంది.  

17న ఉదయం 10.15 గంటలకు యలహంకలో బయలుదేరి తర్వాతి రోజు తెల్లవారుజామున 5 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్‌పాడి, జాలర్‌పేట, కృష్ణరాజపురం మీదుగా నడుస్తాయని  రైల్వే అధికారులు తెలిపారు.
Go Back to Shorts
South Central Railway
Visakhapatnam
Yelahanka
Sankranti

More Telugu News