Australia: ఆస్ట్రేలియాలో అదృశ్యమైన హైదరాబాద్ యువకుడు

Hyderabad youth missing in Australia
  • ఎంఎస్ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన మోసిన్ అలీ
  • డిసెంబర్ 30వ తేదీ నుంచి అదృశ్యం
  • ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు
ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లిన హైదరాబాద్ యువకుడు అదృశ్యమయ్యాడు. వారం రోజులుగా ఆ యువకుడి ఆచూకీ తెలియడం లేదు. వివరాల్లోకి వెళ్తే, నగరానికి చెందిన మహ్మద్ మోసిన్ అలీ (28) ఎంఎస్ చదివేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ఆయన చదువుకుంటున్నాడు.

అయితే డిసెంబర్ 30 నుంచి అతనికి కుటుంబసభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. అలీ ఆచూకీ తెలియకపోవడంతో ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అలీ అదృశ్యం వివరాలను ఆయన సోదరుడు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాదు, అలీ అదృశ్యంపై ఆస్ట్రేలియాలో పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Australia
Hyderabad Student
Missing

More Telugu News