Pushpa: ‘పుష్ప’ను భారీ రేటుకు కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్

Pushpa Sold To Hefty Price For Amazon Prime
  • సుమారు రూ.30 కోట్లకు అమెజాన్ డీల్
  • రేపటి నుంచి సినిమా స్ట్రీమింగ్ 
  • నాలుగు భాషల్లో అందుబాటులోకి
క్రిస్మస్ కానుకగా గత ఏడాది డిసెంబర్ 17న దేశవ్యాప్తంగా రిలీజైన అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మంచి వసూళ్లను రాబట్టింది. ఇక, ఆ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో రేపటి నుంచి సినిమా స్ట్రీమ్ కానుంది. నిన్ననే ఈ విషయాన్ని అమెజాన్ ప్రకటించింది కూడా.

ఇక, ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. రూ.27 కోట్ల నుంచి రూ.30 కోట్లకు డీల్ కుదుర్చుకుందని సమాచారం. నాలుగు భాషల్లో అభిమానుల కోసం సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో సినిమా అందుబాటులోకి రానుంది.
Pushpa
Allu Arjun
Amazon Prime

More Telugu News