Vanama Venkateswara Rao: ఆత్మహత్య వివాదంలో తనయుడు... బహిరంగ లేఖ రాసిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

Vanama Venkateswararao open letter on latest developments
  • పాల్వంచలో ఓ కుటుంబం ఆత్మహత్య
  • వనమా తనయుడు రాఘవేందర్ పై తీవ్ర ఆరోపణలు
  • పరారీలో రాఘవేందర్
  • తనయుడు విచారణకు సహకరించేలా చూస్తానన్న వనమా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఓ కుటుంబం ఆత్మహత్యకు కారకుడంటూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేందర్ పై తీవ్ర ఆరోపణలు రావడం తెలిసిందే. భార్య గురించి ఏ భర్త వినకూడని మాటలు రాఘవేందర్ నోటి నుంచి విన్నానంటూ ఆ కుటుంబ యజమాని రామకృష్ణ సెల్ఫీ వీడియోలో పేర్కొనడం తాజాగా తీవ్ర కలకలం రేపింది. అటు, రాఘవేందర్ పరారీలో ఉన్నాడు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ ద్వారా స్పందించారు. చట్టానికి, విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు. పోలీసుల దర్యాప్తుకు నా కుమారుడు సహకరించేలా బాధ్యత తీసుకుంటా అని హామీ ఇచ్చారు. పార్టీకి, నియోజకవర్గానికి తన కుమారుడ్ని దూరంగా ఉంచుతానని తెలిపారు.
Vanama Venkateswara Rao
Raghavendar
Ramakrsihna
Family
Suicide
Palwancha
Bhadradri Kothagudem District
TRS
Telangana

More Telugu News