Chandrababu: చంద్రబాబుపై సీఐడీ కేసు.. స్టే పొడిగించిన హైకోర్టు

AP High Court extends stay on CID case against Chandrababu in Amaravati assigned lands case
  • అమరావతి భూముల విషయంలో చంద్రబాబు, నారాయణలపై సీఐడీ కేసులు
  • గతంలోనే స్టే విధించిన ఏపీ హైకోర్టు
  • ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అమరావతి అసైన్డ్ భూములకు సంబంధించి ఏపీ సీఐడీ చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ తదితరులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో చంద్రబాబు, నారాయణలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ... గతంలోనే కేసులపై హైకోర్టు స్టే విధించింది. ఇప్పుడు ఆ స్టేను మరోసారి పొడిగించింది. మరో 6 వారాల పాటు స్టేను పొడిగిస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News