ముందస్తు ఎన్నికలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల క్లారిటీ!
- ఐదేళ్లు పాలించమని ప్రజలు మాకు అధికారం ఇచ్చారు
- ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు
- చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సజ్జల
ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని సజ్జల చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం అప్పులు చేస్తోందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ ఉద్యోగుల సంక్షేమం కోసం పీఆర్సీ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.