శ్రీకృష్ణుడు రోజూ నా కలలోకి వస్తాడు: అఖిలేశ్ యాదవ్
- మాదే అధికారం అని చెబుతున్నాడు
- యోగి అన్నింట్లోనూ ఫెయిల్ అయ్యారు
- ఆయన్ను ఎవరూ కాపాడలేరన్న ఎస్పీ చీఫ్
‘‘బాబా (యోగి ఆదిత్యనాథ్) విఫలమయ్యారు. ఎవరూ ఆయన్ను కాపాడలేరు. ప్రతి రోజు రాత్రి కృష్ణుడు నా కలలోకి వస్తాడు. యూపీలో అధికారం మాదేనంటూ చెబుతున్నాడు’’ అన్నారు అఖిలేశ్. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. కాగా, ప్రస్తుతం అఖిలేశ్ యాదవ్ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఆజాంగఢ్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు.