యూకేలో కరోనా విధ్వంసం.. ఒక్క రోజులో 1,29,471 కేసుల నమోదు
- బ్రిటన్‌లో జడలు విప్పుతున్న కరోనా
- గత వారంతో పోలిస్తే ఏకంగా 42 శాతం పెరుగుదల
- ‘రూల్ ఆఫ్ సిక్స్’ను తిరిగి తీసుకొచ్చే యోచన
కేసులు దారుణంగా పెరిగిపోతుండడంతో ‘రూల్ ఆఫ్ సిక్స్’ను తిరిగి తీసుకురావాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ మాత్రం కొత్త సంవత్సరానికి ముందు ప్రజలపై ఎలాంటి కొత్త ఆంక్షలు విధించబోమని చెప్పడం గమనార్హం. ప్రభుత్వ కరోనా వైరస్ డ్యాష్‌బోర్డు ప్రకారం.. డిసెంబరు 23 నాటికి పాజిటివ్ కేసుల వారం రోజుల రోలింగ్ రేటు ప్రతి లక్ష మందికి 1,145.4గా ఉంది.