హార్ధిక్ పాండ్యా భార్య మరోసారి ప్రెగ్నెంట్?

  • కొత్త చర్చకు తావిచ్చిన క్రిస్మస్ ఫొటోలు
  • బేబీ బంప్ తో కనిపించిన నటాషా
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా భార్య నటాషా గర్భం దాల్చిందని వార్తలొస్తున్నాయి. క్రిస్మస్ సందర్భంగా వీరు దిగిన ఫొటో ఈ మేరకు కొత్త చర్చను లేవనెత్తింది. ఈ ఫొటోలో హార్ధిక్, నటాషా, వారి కొడుకు ఉన్నారు. స్ట్రాప్ లెస్ పింక్ వెల్వెట్ డ్రెస్ లో మెరిసిపోతున్న నటాషా బేబీ బంప్ తో కనిపిస్తోంది. కడుపు ఉబ్బెత్తుగా ఉండటంతో ఆమె మరోసారి గర్భవతి అయిందనే ప్రచారం జరుగుతోంది.

ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటాషా మీరు ప్రెగ్నెంటా? అని కొందరు, అగస్త్యకు తమ్ముడా లేక చెల్లెలా? అని మరికొందరు, రెండో మున్నా వస్తున్నాడంటూ ఇంకొందరు ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆమె గర్భవతి అనే విషయం గురించి ఇంత వరకు నటాషా కానీ, హార్ధిక్ కానీ ఎక్కడా వెల్లడించలేదు.

Hardhik Pandya
Team India
Natasha
wife
Baby Bump
Pregnant

More Telugu News