ఆదిత్య థాకరేను చూసి "మ్యావ్" అంటూ పిల్లిలా అరిచిన బీజేపీ ఎమ్మెల్యే
- అసెంబ్లీ ప్రాంగణానికి విచ్చేసిన మంత్రి ఆదిత్య థాకరే
- అప్పటికే అక్కడ బీజేపీ సభ్యుల నిరసన
- మంత్రిని చూసి పిల్లిలా అరిచిన బీజేపీ ఎమ్మెల్యే రాణే
- శివసేన ఆగ్రహం
- రాణేను మందలిస్తామన్న బీజేపీ
నితీశ్ రాణే కేంద్రమంత్రి నారాయణ్ రాణే తనయుడు. జూనియర్ థాకరేను చూసి "మ్యావ్" అని అరవడంపై మీడియా నితీశ్ రాణేను వివరణ కోరగా, "అవును అరిచాను... మళ్లీ ఆ విధంగా అరుస్తాను కూడా" అని బదులిచ్చారు. ఈ పిల్లి కూతలపై అసెంబ్లీలో హోరాహోరీ నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ వెనక్కి తగ్గింది. అనుచితంగా ప్రవర్తించిన నితీశ్ రాణేను మందలిస్తామని హామీ ఇచ్చింది. దాంతో శివసేన సభ్యులు శాంతించారు.