సుకుమార్ నా సినిమాను 3 నెలల్లో తీసేలా చేస్తా: బాలయ్య

Balayya Unstoppable Talk Show
  • 'అన్ స్టాపబుల్'కి పుష్ప టీమ్
  • బన్నీ డైలాగ్స్ చెప్పిన బాలయ్య
  • సుకుమార్ తో సినిమా చేస్తాను
  • మీ చేతిలో పడాల్సిందేనన్న బన్నీ  
సుకుమార్ ఒక సినిమా చేయడానికి చాలా సమయం తీసుకుంటాడు. ఎంత లేదన్నా ఆయన నుంచి ఒక సినిమా రావడానికి రెండేళ్లు పడుతుంది. స్క్రిప్ట్ రెడీ చేయడానికీ .. షూటింగును పూర్తి చేయడానికి ఆయన చాలా సమయం తీసుకుంటారని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి సుకుమార్ తన సినిమాను మూడు నెలల్లో కంప్లీట్ చేసేలా చూస్తానని బాలయ్య అనడం విశేషం.

'ఆహా' ఓటీటీలో బాలయ్య 'అన్ స్టాపబుల్' టాక్ షోకి రీసెంట్ గా 'పుష్ప' టీమ్ వచ్చింది. ఇది 6వ ఎపిసోడ్ గా 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వేదికపై 'పుష్ప' టీమ్ తో కలిసి బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. వచ్చే ఏడాది నేను .. సుక్కూ కలిసి ఒక సినిమాను మూడు నెలల్లో కంప్లీట్ చేయబోతున్నామని బాలయ్య అన్నారు.

దసరాకి కొబ్బరికాయ కొట్టడం .. క్రిస్మస్ కి గుమ్మడికాయ కొట్టడం .. సంక్రాంతికి విడుదల చేయడం జరిగిపోతాయి. మూడు నెలల్లో తెరపై బొమ్మ పడాల్సిందే .. తగ్గేదే లే" అని బాలకృష్ణ అన్నారు. ఆ మాటకి బన్నీ నవ్వుతూ .. " మీ చేతిలో పడితేనేగాని సుకుమార్ సెట్ అవ్వడు" అని అన్నాడు. నిజంగానే ఈ కాంబినేషన్ సెట్ అవుతుందేమో చూడాలి.
Go Back to Shorts
Balakrishna
Allu Arjun
Sukumar
Unstoppable

More Telugu News